గాంధీనగర్, జనవరి 26: దేశవ్యాప్తంగాగణతంత్ర దినోత్సవ వేడుకలు..నింగి, నేల, నీరు వేదికలుగా జరిగాయి. గుజరాత్లోని ద్వారక తీరంలోని స్కూబా డైవర్లు భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్ని వినూత్నంగా నిర్వహించారు. సము ద్రం లోపల 30 మీటర్ల లోతులో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.గణతంత్ర దినోత్సవ వేడుకల్ని అందరూ గుర్తుంచుకునే విధం గా..విలక్షణ శైలిలో జరుపుకున్నారు.
ద్వారక తీర ప్రాంతానికి చెందిన స్కూబా డైవర్ల బృందం అత్యంత సాహసోపేతంగా సముద్రం నీటిలో జాతీయ పతాకాన్ని ఎగురవేయటం అందర్నీ ఆకట్టుకుంది.