IARI | హైదరాబాద్ : భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్(ఐఏఆర్ఐ) గా డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు నియామకం అయ్యారు. ఐఏఆర్ఐ అధిపతిగా ఎంపికైన తొలి తెలుగు శాస్త్రవేత్త చెరుకుమల్లి శ్రీనివాసరావు కావడం గమనార్హం. ప్రస్తుతం నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా ఉన్న శ్రీనివాసరావు.. ఐఏఆర్ఐ డైరెక్టర్గా నియమితులయ్యారు.
1965 అక్టోబర్ 4వ తేదీన కృష్ణా జిల్లా అనిగండ్లపాడులో శ్రీనివాసరావు జన్మించారు. 1975 -80 వరకు అనిగండ్లపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యను అభ్యసించారు. బాపట్ల వ్యవసాయ కాలేజీలో అగ్రికల్చరల్ బీఎస్సీ పట్టా అందుకున్నారు. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఎమ్మెస్సీ, పీహెచ్డీ పూర్తి చేశారు. ఇజ్రాయెల్ టెల్ – అవివ్ యూనివర్సిటీలో పోస్ట్ – డాక్టోరల్ చేసిన శ్రీనివాసరావు.. భారత్లోని పలు పరిశోధన సంస్థల్లో వివిధ హోదాల్లో సేవలందించారు.
ఇవి కూడా చదవండి..
Manmohan Singh | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు అస్వస్థత
Annamalai | డీఎంకేను గద్దె దింపే వరకూ చెప్పులు వేసుకోను.. ఆరు కొరడా దెబ్బలు తింటా.. అన్నామలై..!
SCR | శబరిమల ప్రత్యేక రైళ్లు రద్దు.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన