బెంగళూరు: సైంటిఫిక్ రీసెర్చ్ పేలోడ్ ఉన్న పెద్ద బెలూన్ ఒక గ్రామంలో పడింది. (Scientific Payload Balloon) దీనిని చూసి అక్కడి జనం భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన పరికరం ఉన్న పెద్ద బెలూన్ ఆకాశం నుంచి దిగి జల్సంగి గ్రామంలో శనివారం పడింది. దీనిని చూసి గ్రామస్తులు భయాందోళన చెందారు. ఆ పరికరానికి చెందిన రెడ్ లైట్ వెలుగుతుండటం చూసి వారు మరింత ఆందోళనకు గురయ్యారు. దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, రీసెర్చ్ బెలూన్ పడిన ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. గుమిగూడిన జనాన్ని దూరంగా వెళ్లాలని సూచించారు. ఉపగ్రహ పేలోడ్ ఉన్న ఆ బెలూన్ హైదరాబాద్‌లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్ఆర్)కు చెందినదిగా గుర్తించారు. ఆ రీసెర్చ్ బెలూన్ గురించి కన్నడలో రాసి ఉన్న నోట్‌ను కూడా ఆ పరికరం వద్ద ఉండటాన్ని గమనించారు. మరోవైపు గ్రామంలో పడిన రీసెర్చ్ బెలూన్‌కు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
A satellite payload #baloon of #TIFR , #Hyderabad fell on a house from sky in Bidar with a huge machine.
A huge size balloon (looks like an airbag) fell from the sky, created panic among the villagers Jalsangi village in #Homnabad Taluk, #Bidar district, #Karnataka , early… pic.twitter.com/Dri4CikSdE
— Surya Reddy (@jsuryareddy) January 18, 2025