శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 21, 2020 , 10:36:31

ఈ నెల 23 నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం

ఈ నెల 23 నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం

ముంబై: మ‌హారాష్ట్ర‌లోని పుణె జిల్లాలో సోమ‌వారం నుంచి బ‌డులు, జూనియ‌ర్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. క‌రోనా ప‌రిస్థితుల‌కు అనుగుణంగా పాఠ‌శాల‌లు, కాలేజీల పునఃప్రారంభంపై ఆయా ప్రాంతాల అధికారులే అధికారులే నిర్ణ‌యం తీసుకుంటార‌ని రాష్ట్ర పాఠ‌శాల విద్యాశాఖ మంత్రి వ‌ర్షా గైక్వాడ్ వెల్ల‌డించారు. దీంతో పుణే జిల్లా అధికారులు న‌వంబ‌ర్ 23 నుంచి స్కూళ్ల‌లో 9, 10 త‌ర‌గ‌తులు, జూనియ‌ర్‌ కాలేజీల్లో విద్యార్థుల‌కు త‌ర‌గతులు ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు. అయితే క‌రోనా నిబంధ‌న‌లను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని ఆయా యాజ‌మాన్యాల‌కు స్ప‌ష్టం చేశారు. 

స్కూళ్ల‌లో థ‌ర్మ‌ల్ స్కీనింగ్ చేస్తామ‌ని, ప‌ల్స్ ఆక్సీమీట‌ర్లు, హ్యాండ్ వాష్ అందుబాటులో ఉంచుతామ‌ని‌, పాఠశాల ఆవార‌ణ‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శాన‌టైజ్ చేస్తామ‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. అదేవిధంగా బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బందికి త‌ప్ప‌నిస‌రిగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. ఒక్కో బెంచీకి ఒక్క విద్యార్థిని మాత్ర‌మే కూర్చోబెట్టాల‌న్నారు. కాగా, జిల్లాలో తొమ్మిది, ప‌దో త‌ర‌గతులు చెప్పే టీచ‌ర్ల‌తోపాటు, జూనియర్ కాలేజీల్లో మొత్తం 18 వేల మంది సిబ్బంది ప‌నిచేస్తున్నార‌ని క‌లెక్ట‌ర్ రాజేష్ దేశ్‌ముఖ్ తెలిపారు. ‌వారిలో నిన్న‌‌టివ‌ర‌కు 3 వేల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు పూర్తి చేశామ‌ని వెల్ల‌డించారు.