Supreme court : క్రిమినల్ కేసు (Criminal case) లో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తికి మద్దతుగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి (Senior IPS officer) కి సుప్రీంకోర్టు (Supreme Court) షాకాజ్ నోటీస్ జారీచేసింది. బీహార్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అశోక్ మిశ్రా (Ashok Misra) సమస్తిపూర్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో ఓ క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి మద్దతుగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దాంతో అతడికి సుప్రీంకోర్టు షోకాజ్ నోటీస్ ఇచ్చింది.
జస్టిస్ అహ్సాన్ అమానుల్లా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం అశోక్ మిశ్రా అఫిడవిట్‌ను పరిశీలించింది. కోర్టు ఆదేశాలను సీరియస్‌గా తీసుకోకుండా క్యాజువల్‌గా ఆ అఫిడవిట్‌ను దాఖలు చేసినట్లు గుర్తించింది. దానిపై కోర్టు ముందు ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నిందితుడికి మద్దతుగా అఫిడవిట్ దాఖలు చేసినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ఆ నోటీసులలో ప్రశ్నించింది.