Rupee Value | చాలాకాలం తర్వాత స్వల్పంగా బలపడ్డ రూపాయి
Rupee Value | అమెరికన్ డాలర్ (Dallor) తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం స్వల్పంగా బలపడింది. కొంతకాలంగా క్షీణిస్తూ వస్తున్న రూపాయికి ఇది కాస్త ఊరటగా చెప్పవచ్చు. ఇవాళ ఫారెక్స్ మార్కెట్ (Forex Market) లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 87.36 రూపాయల వద్ద స్థిరపడింది.
Rupee Value : అమెరికన్ డాలర్ (Dallor) తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం స్వల్పంగా బలపడింది. కొంతకాలంగా క్షీణిస్తూ వస్తున్న రూపాయికి ఇది కాస్త ఊరటగా చెప్పవచ్చు. ఇవాళ ఫారెక్స్ మార్కెట్ (Forex Market) లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 87.36 రూపాయల వద్ద స్థిరపడింది. దాంతో ఈ ఏడాదిలో నమోదైన గరిష్ఠ పతనం నుంచి రూపాయి కాస్త కోలుకున్నట్లయ్యింది.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఆ సమయంలో ఒక డాలర్‌కు రూ.88.10 వరకు చెల్లించాల్సి వచ్చింది. దాంతో పోలిస్తే ఇవాళ్టి 87.36 రూపాయలు కొంత సానుకూలమని చెప్పవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో రూపాయి తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. గడిచిన ఏడాది కాలంలో రూపాయి విలువ 4.06 శాతం బలహీనపడగా.. గత నెల రోజుల్లోనే 1.77 శాతం పతనమైంది.
ఈ ఏడాది జనవరి నుంచి చూసినప్పుడు డాలర్‌పై రూపాయి విలువ సుమారు 1.82 శాతం మేర నష్టపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గణాంకాలు, రిజర్వ్ బ్యాంక్ చర్యలు, లేదా ప్రపంచ మార్కెట్లలోని సానుకూల సెంటిమెంట్ లాంటి కారణాలవల్ల రూపాయికి డిమాండ్ పెరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ పురోగతి తాత్కాలికమే కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ త్రైమాసికం చివరి నాటికి డాలర్‌తో రూపాయి మారకం విలువ తిరిగి 87.52 రూపాయలకు చేరే అవకాశం ఉంది. రాబోయే 12 నెలల్లో కూడా రూపాయి మారకం విలువ స్వల్పంగా క్షీణించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన మెరుగుదల ఉంటేనే రూపాయి విలువ దీర్ఘకాలంలో నిలదొక్కుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
Read More >>
రాహుల్‌పై పరువునష్టం కేసులో సుప్రీం స్టే.. అయితే ఆ వ్యాఖ్యలపై మాత్రం ఆగ్రహం
సనాతన బానిసత్వాన్ని అంతంచేసే ఆయుధం అదొక్కటే.. కమల్ హాసన్
టీడీపీ ఎమ్మెల్యే రాసలీలు.. వీడియో వైరల్
మార్నింగ్ వాక్ చేస్తుండగా.. కాంగ్రెస్ ఎంపీ మెడలో చైన్ లాక్కెళ్లిన దుండగుడు
మరిన్ని కష్టాల్లో అనిల్ అంబానీ.. బ్యాంకులకు ఈడీ లేఖలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

