గుంటూరు: ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే (TDP MLA) రాసలీల వీడియో వైరల్గా మారింది. గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్.. గతంలో కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన ఓ మహిళతో రొమాంటిక్గా సైగలు చేస్తూ మాట్లాడుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది.
ఆ మహిళ రైలులో ప్రయాణిస్తుండగా ఎమ్మెల్యే నసీర్ తన కార్యాలయంలో ఉండి వీడియో కాల్చేసి మాట్లాడినట్లు స్పష్టమైంది. ప్రజాప్రతినిథిగా ఉన్న ఆయన మహిళ పట్ల వ్యవహరించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలో ఆడియో వినపడకపోయినా ఎమ్మెల్యే సైగలు, హావభావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కాగా, గతంలో కూడా టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే రాసలీలకు సంబంధించిన వీడియో లీక్ అయిన విషయం తెలిసిందే. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఓ మహిళతో రాసలీలల్లో పాల్గొంటున్న వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేసింది. చెల్లి అంటూనే తనపై మూడుసార్లు లైంగికంగా దాడికి పాల్పడినట్లు ఆయనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇద్దరం కలిసి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నామని, పార్టీ కార్యక్రమాల్లో పరిచయమై తన ఫోన్ నంబర్ తీసుకున్నాడని పేర్కొంది. పదేపదే ఫోన్ చేసేవాడని, లైంగిక వాంఛ తీర్చకుంటే కుంటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించాడని వెల్లడించింది.
మహిళకు ముద్దులు పెడుతూ టీడీపీ ఎమ్మెల్యే వీడియో కాల్ లీక్
ఓ మహిళతో వీడియో కాల్లో ముద్దులు పెడుతూ, సైగలు చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ pic.twitter.com/mPcxfsyOvC
— Telugu Scribe (@TeluguScribe) August 4, 2025