న్యూఢిల్లీ, అక్టోబర్ 20: అటవీ సంరక్షణ(సవరణ) చట్టం-2023 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఆరువారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.
1996లో ఓ కేసు విచారణ సందర్భంగా అటవీ అనే పదానికి గల నిర్వచనాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించిందని, అయితే 2023 చట్టం అటవీ నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నదని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.