న్యూఢిల్లీ : ఓటర్లకు జాబితా ప్రక్రియకు చెందిన ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) పూర్తి చేయడంలో ఎటువంటి అడ్డంకులు సృష్టించవద్దని సోమవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కాగా ఈ ప్రక్రియలో నిజమైన ఇబ్బందులను పరిష్కరిస్తామని ప్రభుత్వానికి సుప్రీం హామీ ఇచ్చింది. బెంగాల్ సర్లో దరఖాస్తుల పరిశీలన లేదా పూర్తిచేయడానికి, డాటాను ఖరారు చేయడానికి గడువును ఒక వారం పొడిగించింది.
వాట్సాప్ ద్వారా అధికారిక ఆదేశాలు ఇవ్వడాన్ని నిలిపివేయాలని కోరుతూ సర్ ప్రక్రియలో మార్పులు చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టును కోరారు. అన్ని ఆదేశాలను అధికారికంగా జారీచేయాలని, వాటిని ఈసీఐ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం డిమాండు చేసింది. మైక్రో అబ్జర్వర్లను తొలగించాలని, బదులుగా 8,505 గ్రూప్ బీ అధికారులను ప్రతిపాదించింది. సీజేఐ కోర్టు వైఖరిని స్పష్టం చేస్తూ తాము అవరోధాలను తొలగిస్తామని, అయితే సర్ ప్రక్రియ పూర్తిలో ఎటువంటి అడ్డంకులను సృష్టంచబోమని తెలిపారు.