ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దహిషార్ బ్రాంచ్లో పట్టపగలే దోపిడీ జరిగింది. ఈ నెల 29వ తేదీన మధ్యాహ్నం 3:27 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు మాస్కులు ధరించి, బ్యాంకులోకి ప్రవేశించారు. ఒక యువకుడు తుపాకీతో ఉద్యోగులను బెదిరిస్తుండగా, మరో యువకుడు క్యాషియర్ క్యాబిన్లోకి చేరుకుని అక్కడున్న నగదును ఎత్తుకెళ్లాడు.
దుండగుడు గాల్లోకి కాల్పులు జరపడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దోపిడీ దొంగలు రూ.2.5 లక్షల నగదును చోరీ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులను పట్టుకునేందుకు 8 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
#WatchVideo: #SBI branch looted at gunpoint in broad daylight in #Dahisar
— Free Press Journal (@fpjindia) December 30, 2021
🎥@GaadSachin #News #BankRobbery #India #Bank #Mumbai @MumbaiPolice @DGPMaharashtra @CPMumbaiPolice pic.twitter.com/BxKl0K8OfE