న్యూఢిల్లీ : దేశ ప్రధాని భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన 140 కోట్ల మంది దేశ ప్రజలకు ప్రధాని అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) అన్నారు. ప్రధాని ఏ ఒక్క వర్గానికో, వర్ణానికో ప్రాతినిధ్యం వహించరని స్పష్టం చేశారు. దేశం కేవలం హిందువులే కాకుండా ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు సహా దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి బాధ్యతనూ తలకెత్తుకోవాలని ఫరూక్ అబ్ధుల్లా వ్యాఖ్యనించారు.
పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఫరూక్ అబ్ధుల్లా మాట్లాడారు. మీరు ఎంతమంది కశ్మీరీ పండిట్లను వెనక్కి తీసుకువచ్చారు. తాము భారత్‌లో భాగం కాదని చెప్పకండి..తాము పాకిస్తానీలమని చెప్పకండని ఆయన పేర్కొన్నారు. ఇక అంతకుముందు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష ఎంపీలు మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.
దేశంలో ఉపాధి లభించక నిరుద్యోగ యువత దిక్కుతోచని స్ధితిలో ఉందని జేడీయూ (JDU) జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ ఆరోపించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాషాయ పార్టీ తన హామీని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని 43 ర్యాలీలు నిర్వహిస్తే బీజేపీకి కేవలం 52 సీట్లే దక్కాయని అన్నారు. మోదీ మేజిక్ పనిచయకపోవడంతో కమలనాధులు లాలూ కుటుంబంపై దాడులు చేయించారని లలన్ సింగ్ లోక్‌సభలో ఆరోపించారు.
Read More :
Mukesh Ambani | లగ్జరీ ఇంటిని అమ్మేసిన ముకేశ్ అంబానీ..! ఎన్ని కోట్లకంటే..?