న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిం ది. భారత్ నుంచి ఈసారి 79,237 మంది యాత్రికులను అనుమతించనున్నట్టు సౌదీ సమాచారం అందించిందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది.
65 ఏండ్లలోపు వయసు వారిని మాత్రమే అనుమతిస్తున్నామని సౌదీ పేర్కొన్నదని తెలిపింది. ఆర్టీపీసీర్ పరీక్ష, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసిందని, యాత్రికుల సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.