Santiago Martin : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ ఎలక్టోరల్ బాండ్ల వివరాలను తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం లాటరీ కింగ్‌గా పేరొందిన శాంటియాగో మార్టిన్‌కు చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీ అత్యధికంగా రూ. 1350 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. మయన్మార్‌లోని యంగోన్లో కార్మికుడిగా శాంటియాగో మార్టిన్ తన కెరీర్‌ను ప్రారంభించాడు.
భారత్‌కు తిరిగివచ్చిన అనంతరం 1988లో తమిళనాడులో ఆయన లాటరీ బిజినెస్‌ను చేపట్టాడు. ఆపై కర్నాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్, మహారాష్ట్రతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించాడు. మార్టిన్ తొలుత ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వ లాటరీ స్కీమ్‌లను నిర్వహించడంపై దృష్టి సారించాడు. ఆపై నిర్మాణ, రియల్ ఎస్టేట్, టెక్స్టైల్స్, ఆతిధ్య రంగాలకు తన వ్యాపారాలను విస్తరించాడు.
శాండియాగో మార్టిన్ నేతృత్వంలోని ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వరల్డ్ లాటరీ అసోసియేషన్‌లో సభ్యత్వం పొందింది. ఇక మార్టిన్ ప్రస్తుతం ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, స్పోర్ట్స్ బెట్టింగ్‌లో అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం.
ఆదాయ పన్ను ఎగవేత, మనీ ల్యాండరింగ్, అక్రమాల వంటి పలు ఆరోపణలపై 2011 నుంచి మార్టిన్‌తో పాటు ఆయన కంపెనీపై పలు దర్యాప్తులు సాగాయి. ఈడీ, ఐటీ సహా కేంద్ర దర్యాప్తు సంస్ధలు మార్టిన్‌తో పాటు ఆయన కంపెనీల కార్యకలాపాలపై నిఘా పెట్టాయి. 2023లో ఈడీ మార్టిన్‌కు చెందిన రూ. 457 కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేసింది.
Read More :
Gutha Sukhender Reddy | ఏ పార్టీ కండువా కప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు