ముంబై : 2019లో మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వం మెజారిటీ సాధించిన అనంతరం సీఎం పదవికి శివసేన ఏక్నాథ్ షిండే పేరును ప్రతిపాదించిందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) వెల్లడించారు. శివసేనతో అధికారాన్ని పంచుకునేందుకు బీజేపీ తిరస్కరించిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ క్విట్ ఇండియా వ్యాఖ్యలను కూడా రౌత్ ఎండగట్టారు.
క్విట్ ఇండియాతో బీజేపీకి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. బీజేపీ పూర్వీకులు కనీసం క్విట్ ఇండియా కార్యక్రమంలో పాలుపంచుకోలేదన్నారు. విపక్ష ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ ప్రధాని చేసిన వ్యాఖ్యల పట్ల రౌత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక 2019 అక్టోబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించగా బీజేపీ, శివసేన కూటమి 161 సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను కైవసం చేసుకుంది.
161 స్ధానాలకు గాను శివసేన 56 స్ధానాల్లో గెలుపొందింది. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి శివసేన మద్దతు నిరాకరించింది. చెరి రెండున్నరేండ్లు సీఎం పదవిని పంచుకోవాలని ప్రతిపాదించగా కాషాయ పార్టీ తోసిపుచ్చింది. దీంతో బీజేపీ, శివసేనల మధ్య దీర్ఘకాలంగా సాగిన పొత్తుకు విఘాతం ఏర్పడింది.
Read More :