ముంబై : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ నేపధ్యంలో శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుంటుందని వ్యాఖ్యానించారు. మోదీ బౌలింగ్ చేస్తే అమిత్ షా బ్యాటింగ్ చేస్తారని బీజేపీ నేతలు బౌండరీ లైన్ వద్ద నిలబడతారని ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ ఉన్నందువల్లే మనం వరల్డ్ కప్ గెలిచామని ఆ ఘనతను వీరు తామ ఖాతాలో వేసుకుంటారని చెప్పారు. కేంద్రంలో, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కటీ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎవరైనా మరణించినా, స్పోర్ట్స్ ఈవెంట్ అయినా అన్నీ రాజకీయ రంగు పులుముకున్నాయని అన్నారు. ఈ రోజుల్లో ఏదైన జరగవచ్చని రౌత్ వ్యాఖ్యానించారు. ఇక ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య అహ్మదాబాద్లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్బంగా రౌత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Read More :
Mukesh Ambani | మనుమల బర్త్ డే వేడుకల్లో ముకేశ్ అంబానీ దంపతులు