న్యూఢిల్లీ: పక్కా ప్లాన్ ప్రకారం సంభల్‌లో హింసకు పాల్పడినట్లు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) ఆరోపించారు. మతసామరస్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. లోక్‌సభలో జీరో అవర్‌లో సంభల్‌లో జరిగిన హింసపై మాట్లాడారు. మొఘల్ కాలం నాటి మసీదులో కోర్టు ఆదేశాల ప్రకారం సర్వే చేపట్టడాన్ని సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకించింది. మసీదు సర్వే ద్వారా.. గంగా-జమునా తెహజీబ్‌ను దెబ్బతీస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఎక్కడపడితే అక్కడ తొవ్వాలనుకునేవాళ్లు.. ఒక రోజు ఈ దేశ సోదరభావాన్ని కోల్పోతారని అఖిలేశ్ హెచ్చరించారు. యూపీ, కేంద్రంలోని బీజేపీ సర్కార్లను ఉద్దేశిస్తూ ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
సంభల్ హింసలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అఖిలేశ్ ఆరోపణ చేయడంతో సభలో రగడ మొదలైంది. అఖిలేశ్‌కు అండగా పలు విపక్ష ఎంపీలు నిలిచారు. అయితే మళ్లీ సభ ఆర్డర్‌లోకి వచ్చిన తర్వాత.. అఖిలేశ్ యాదవ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ ప్రభుత్వం రాజ్యాంగాన్ని విశ్వసించదని అన్నారు. యూపీలో నవంబర్ 13వ తేదీన జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేశారని ఆరోపించారు. నవంబర్ 19వ తేదీన మసీదులో సర్వే చేయించి, 20వ తేదీన ఎన్నికలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. నవంబర్ 24వ తేదీన మరో సర్వే చేపట్టారని, ఆ ప్రదేశానికి చేరుకున్న ప్రజలపై సర్కిల్ ఆఫీసర్ లాఠీచార్జ్ చేశాడని, ఆ తర్వాత పోలీసులు ఫైరింగ్ జరిపినట్లు అఖిలేశ్ తెలిపారు. డజన్ల సంఖ్యలో జనం గాయపడ్డారని, దాంట్లో అయిదుగురు మృతిచెందారని, పోలీసులపై మర్డర్ కేసు నమోదు చేయాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు.
#WATCH | On the Sambhal issue, Samajwadi Party MP Akhilesh Yadav says “…The incident that took place in Sambhal is a well-planned conspiracy…By-elections were supposed to be held in Uttar Pradesh on 13th November but it was postponed to 20th November…This Govt does not… pic.twitter.com/vOadrWMNgo
— ANI (@ANI) December 3, 2024