లక్నో : వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Polls) యూపీలోని 80 లోక్‌సభ స్ధానాలకు గాను 65 స్ధానాల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దీటైన అభ్యర్ధులను కూడా ఎస్పీ ఖరారు చేస్తోంది. ఇక రాష్ట్రంలో మిగిలిన 15 సీట్లలో కాంగ్రెస్ సహా ఇతర విపక్ష ఇండియా కూటమి పార్టీలు పోటీ చేస్తాయని ఎస్పీ వర్గాల సమాచారం.
విపక్ష ఇండియా కూటమి వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నాటికి క్రియాశీలకంగా ఉంటే రాయ్‌బరేలి, అమేథి నియోజకవర్గాల్లో సోనియా, రాహుల్ గాంధీలపై ఎస్పీ తమ అభ్యర్ధులను పోటీలో నిలపదు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీల మధ్య పొత్తు ప్రతిపాదన విఫలమైన క్రమంలో లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో అనుసరించాల్సిన వ్యూహానికి ఎస్పీ పదను పెడుతోంది.
మరోవైపు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటు విషయంలో కాంగ్రెస్ వైఖరిని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్రంగా తప్పుపట్టారు. మధ్యప్రదేశ్‌లో ఎస్పీకి ఆరు స్ధానాలు కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆపై తమను విస్మరించిందని అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శులు గుప్పించారు.
Read More :