Akhilesh Yadav : రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఉత్తర్ ప్రదేశ్ నుంచి పోటీ చేసే 16 మంది అభ్యర్ధులను సమాజ్‌వాదీ పార్టీ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. విపక్ష ఇండియా కూటమి కాంగ్రెస్ కోసం 11 సీట్లు పక్కనపెడతామని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించిన మరుసటి రోజు ఎస్పీ తమ ఎంపీ అభ్యర్ధులను ప్రకటించింది.
ఎస్పీ విడుదల చేసిన 16 మంది అభ్యర్ధుల జాబితాను పరిశీలిస్తే.. మెయిన్‌పురి నుంచి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేయనుండగా, రవిదాస్ మెహ్రోత్రా లక్నో నుంచి, షఫీకుర్ రెహ్మాన్ బర్ఖ్ సంభాల్ నుంచి బరిలో నిలుస్తారు. ఎస్పీ జాబితాలో 11 మంది ఓబీసీలు ఉండగా, ఒక ముస్లిం, ఒక దళిత్, ఒక ఠాకూర్, ఒక టాండన్ అభ్యర్ధి ఉండగా ఖత్రి వర్గానికి చెందిన అభ్యర్ధి ఒకరికి చోటు దక్కింది.
11 మంది ఓబీసీల్లో నలుగురు కుర్మి, యాదవులు ముగ్గురు, ఇద్దరు సఖ్యా, నిషాద్ ఒకటి, పాల్ వర్గానికి చెందిన అభ్యర్ధి ఒకరు ఉన్నారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి ఎన్డీయేలో చేరడం, బెంగాల్లో మమత రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన నేపధ్యంలో ఎస్పీ ఎంపీ అభ్యర్ధుల తొలి జాబితా విడుదలైంది.
Read More :