ముంబై, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘వందేమాతరం’ గేయాన్ని ముస్లింలు పాడలేరని, దానిని ఆలపించాలని తనను ఎవరూ బలవంతం చేయలేరని సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అసీం అజ్మీ అన్నారు. ‘వందేమాతరం’ జాతీయ గేయం ఆలాపన కార్యక్రమంలో పాల్గొనాలని తనకు వచ్చిన ఆహ్వానంపై ఆయన ఘాటుగా స్పందించారు.
ఇస్లాంలో అల్లాను తప్ప, భూమిని, సూర్యుడిని పూజించడం ఉండదని చెప్పారు. “మీరు నమాజ్ చేయనట్లుగానే, ముస్లింలు వందేమాతరం పాడలేరు” అని తెలిపారు.