Sam Pitroda: చైనా మన శత్రువు కాదు.. సామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు
Sam Pitroda: చైనాను శత్రు దేశంగా చూడవద్దు అని కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా తెలిపారు. ఆ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. చైనాతో వైరం పెట్టుకునే రీతిలో ఇండియా వ్యవహరిస్తునదని, ఆ మైండ్‌సెట్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉందని పిట్రోడా పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఓవర్సీస్ యూనిట్ అధినేత సామ్ పిట్రోడా(Sam Pitroda) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం చైనాతో ఉన్న వైరంపై ఆయన అనవసర వ్యాఖ్యలు చేశారు. చైనాను శత్రు దేశంగా చూడవద్దు అని పిట్రోడా తెలిపారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. చైనాతో వైరం పెట్టుకునే రీతిలో ఇండియా వ్యవహరిస్తునదని, ఆ మైండ్‌సెట్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉందని పిట్రోడా తెలిపారు. అయితే చైనాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు.. పిట్రోడా వ్యాఖ్యలకు భిన్నంగా ఉండడంతో.. బీజేపీ ఆ పార్టీని తప్పుపట్టింది. భారత్ తన భూభాగాన్ని చైనాకు సమర్పించిందని రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను కేంద్రం కొట్టిపారేసింది.
చైనా నుంచి ఎటువంటి సమస్య ఉందో అర్థం కావడం లేదని, అమెరికా ప్రమేయం వల్లే చైనాను శత్రువుగా చూస్తున్నారని పిట్రోడా తెలిపారు. అన్ని దేశాలు ఘర్షణలు మానుకొని, ఒక్కటి కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. మన వ్యవహార శైలి ముందు నుంచీ వైరం పెట్టుకునే రీతిలో ఉందని, ఇలాంటి ప్రవర్తన వల్లే శత్రువులు తయారవుతారని, చైనా మన శత్రువు కాదన్న ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని పిట్రోడా చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

