Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) స్టేజ్‌పై చిందేశారు. పలువురు బాలీవుడ్ స్టార్ నటులతో కలిసి వేదికపై కాలు కదిపారు. 29వ కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (29th Kolkata International Film Festival 2023) ఇటీవలే అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. పశ్చిమబెంగా రాష్ట్ర సమాచార, సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో కేఐఎఫ్ఎఫ్ (KIFF) వేడుక గత మంగళవారం ఘనంగా ప్రారంభమైంది.
ఈ వేడుకకు దీదీతోపాటు ముఖ్య అతిథులుగా బాలీవుడ్ స్టార్ నటులు సల్మాన్ ఖాన్ (Salman Khan), అనిల్ కపూర్, సోనాక్షి సిన్హా, క్రికెటర్ సౌరభ్ గంగూలీ తదితరులు హాజరయ్యారు. వేడుకను కేఐఎఫ్ఎఫ్ థీమ్ సాంగ్‌తో ప్రారంభించారు. ఆ వెంటనే స్టేజ్‌పై ఉన్న సల్మాన్.. దీదీని డ్యాన్స్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. దీంతో దీదీ వేదికపై కాలు కదిపి అందరినీ ఆకర్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
WestBengal CM #MamataBanerjee with Megastar #SalmanKhan at
Kolkata International Film Festival #KIFF ❤️ pic.twitter.com/mfRGiQfN6A— Salman Khan Fan Club (@BSKFanClub) December 7, 2023
Look how #SalmanKhan requested #MamataBanerjee to dance pic.twitter.com/lxDNVekiTC
— Kamalika Sengupta (@KamalikaSengupt) December 5, 2023
Also Read..
Cyclone Michaung | మిగ్జాం తుఫాన్ బీభత్సం.. అభిమానులంతా సాయం చేయాలని కోరిన దళపతి విజయ్
INDIA Bloc | ఆ భేటీలు ఛాయ్, సమోసాలకే పరిమితం : విపక్ష ఇండియా కూటమిపై జేడీయూ సెటైర్లు
NRI Fraud | విలాసాల కోసం ఫుట్‌బాల్ జట్టుకు టోకరా.. ఏకంగా 183 కోట్లు కొట్టేసిన ప్రవాస భారతీయుడు