Cyclone Michaung | మిగ్జాం తుఫాన్ బీభత్సం.. అభిమానులంతా సాయం చేయాలని కోరిన దళపతి విజయ్
Actor Vijay | మిగ్జాం తుపాను కారణంగా తమిళనాడును వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. భారీ వర్షాల ధాటికి వరదలు పోటెత్తడంతో చెన్నైతో పాటు కాంచీపురం, నాగపట్టనం, కడ్డళూరు, తిరువళ్లూర్ను వరదలు ముంచెత్తాయి. చెన్నైలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి.
Actor Vijay | మిగ్జాం తుపాను కారణంగా తమిళనాడును వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. భారీ వర్షాల ధాటికి వరదలు పోటెత్తడంతో చెన్నైతో పాటు కాంచీపురం, నాగపట్టనం, కడ్డళూరు, తిరువళ్లూర్ను వరదలు ముంచెత్తాయి. చెన్నైలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. సహాయక సిబ్బంది ఎంత శ్రమిస్తున్నా రోడ్లు వరదతో జలమట్టమవుతున్నాయి. అలాగే రైలు, విమాన సర్వీసులు కూడా దెబ్బతిన్నాయి.
ప్రస్తుతం తుపాను తీరానికి చేరుకోవడంతో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. నగరంలో కొన్ని చోట్ల నిలిచిన వర్షపు నీరు ఇంకిపోతోంది. దీంతో చెన్నై నగరం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఈ పరిస్థితిలో బాధితులకు సాయం చేసేందుకు రాజకీయ సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) కూడా ఈ ఘటనపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తన అభిమానులందరూ స్వచ్ఛందంగా వచ్చి బాధితులను ఆదుకోవాలని కోరారు.
మిగ్జాం తుఫాను భారీ వర్షాల కారణంగా ఎంతో మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. తాగునీరు, ఆహారం వంటి కనీస వసతులు లేక వేలాది మంది నానాఅవస్థలు పడుతున్నారు. వరదల్లో ఎంతోమంది చిక్కుకున్నారు. తమను రక్షించాలని కోరుతూ సోషల్మీడియాలో ఇంకా వారి ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో, బాధిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల్లో నా అభిమానులంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరుతున్నా అంటూ విజయ్ ట్విట్టర్ వేదికగా రాసుకోచ్చాడు.
சென்னை மற்றும் புறநகர் பகுதிகளில் “மிக்ஜாம்” புயல் கனமழை காரணமாக குழந்தைகள் பெண்கள் முதியவர்கள் உட்பட பொதுமக்கள் பெரும் சிரமத்திற்கு உள்ளாகி உள்ளனர். ஆயிரக்கணக்கான மக்கள் குடிநீர் மற்றும் உணவின்றியும் போதிய அடிப்படை வசதிகளின்றியும் தவித்து வருவதாக செய்திகள் வருகின்றன. வெள்ளம்…
— Vijay (@actorvijay) December 6, 2023
మరోవైపు తుపాను బాధితులకు నటులు సూర్య(Suriya), కార్తీలు రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే యంగ్ హీరో హరీశ్ కల్యాణ్ కూడా తనవంతుగా రూ.లక్ష సాయం చేస్తున్నట్లు ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

