NRI Fraud | విలాసాల కోసం ఫుట్‌బాల్ జట్టుకు టోకరా.. ఏకంగా 183 కోట్లు కొట్టేసిన ప్రవాస భారతీయుడు
NRI Fraud : అమెరికాలో ఉంటున్న ఓ ప్రవాస భారతీయుడు తన విలాసాల కోసం తప్పుదోవన డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. అందుకు పెద్ద పథకమే వేసిన అతడు.. గతంలో తాను ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన అమెరికా ఫుట్‌బాల్ ఫ్రాంచైజీ జాక్స్ ఆన్విల్లే జాగ్వార్స్(Jacksonville Jaguars) నుంచి ఏకంగా...
NRI Fraud : అమెరికాలో ఉంటున్న ఓ ప్రవాస భారతీయుడు తన విలాసాల కోసం తప్పుదోవన డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. అందుకు పెద్ద పథకమే వేసిన అతడు.. గతంలో తాను ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన అమెరికా ఫుట్‌బాల్ ఫ్రాంచైజీ జాక్స్ ఆన్విల్లే జాగ్వార్స్(Jacksonville Jaguars) నుంచి ఏకంగా రూ.183 కోట్లు దొంగిలించాడు. అతడి పేరు అమిత్ పటేల్(Amit Patel). ఫ్రాంచైజీ కళ్లుగప్పి కాజేసిన డబ్బుతో అమిత్ ఫ్లోరిడాలో భారీ భవనం కొన్నాడు.
అంతేకాదు ఎక్కడివెళ్లినా ప్రైవేట్ జెట్స్‌లోనే ప్రయాణించేవాడు. ఖరీదైన టెస్లా(Tesla) కారు, చేతి గడియారాలతో పాటు క్రిప్టో కరెన్సీ(Crypto Currency) కొన్నాడు. పలు విదేశీ పర్యటనల కోసం అమిత్ ఆ డబ్బును ఖర్చు చేశాడు.
ఎలా కాజేశాడంటే..?
జాక్స్ ఆన్విల్లే జాగ్వార్స్ ఫుట్‌బాల్ ఫ్రాంచైజీలో అమిత్ పాటిల్ ఆర్ధిక విశ్లేషణ, ప్లానింగ్ టీమ్‌కు మేనేజర్‌గా జాయిన్ అయ్యాడు. జాగ్వార్స్ ఉగ్యోగుల లావాదేవీల కోసం యాజమాన్యం వర్చువల్ క్రెడిట్ కార్డు(Virtual Credit Card)ను ప్రవేశపెట్టింది. మొదట్లో నమ్మకంగా పనిచేసిన అమిత్ ఫ్రాంచైజీ నమ్మకం చూరగొన్నాడు. అయితే..కొన్నాళ్లకు అతడు విలాసవంతమైన జీవితం గడపాలనే ఆలోచనతో అడ్డదారులు తొక్కాడు.
జాక్స్ ఆన్విల్లే జాగ్వార్స్ ఫుట్‌బాల్ జట్టు

వర్చువల్ క్రెడిట్ కార్డును దుర్వినియోగం చేసిన అమిత్ క్యాటరింగ్, విమాన చార్జీలు, హోటల్ బిల్లులను కొత్తగా సృష్టించాడు. మూడేండ్ల కాలంలో అలా అమిత్ జాగ్వార్స్ ఖాతా నుంచి రూ.183 కోట్లు కొట్టేశాడు. ఈ విషయం బయటపపడంతో జాక్స్ ఆన్విల్లే జాగ్వార్స్ మేనేజ్మెంట్ అమిత్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగం నుంచి తీసేసింది. తన విలాసాల కోసం భారీ ఆర్థిక నేరానికి పాల్పడిన అమిత్ ప్రస్తతం కోర్టు మెట్ల చుట్టూ తిరుగుతున్నాడు.
ఇవి కూడా చదవండి
- Google new AI Model | బార్డ్‌లో అందుబాటులోకి గూగుల్ నూతన ఏఐ మోడల్ జెమిని
- Yukti Thareja | గులాబీ రంగు డ్రెస్‌లో గుబాళిస్తున్న యుక్తి తరేజా..
- Telangana Ministers | తెలంగాణ మంత్రులుగా ప్రమాణం చేసింది వీరే..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

