న్యూఢిల్లీ : నానో, ప్రొ, అల్ట్రా పరిమాణాల్లో గూగుల్ లాంఛ్ చేసిన జెమిని ఏఐ (Google new AI Model) ప్రస్తుతం బార్డ్‌లో అందుబాటులోకి వచ్చింది. పిక్సెల్ 8 ప్రొ, బార్డ్‌లో జెమిని ఏఐని యూజర్లు యాక్సెస్ చేసుకోవచ్చు. ఏఐ మోడల్ జెమిని బార్డ్‌లో అడ్వాన్స్డ్ టెక్ట్స్ ఆధారిత సామర్ధ్యాలను ఆఫర్ చేస్తోంది. యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా గూగుల్ ఏఐ మోడల్ జెమినిని అందుబాటులోకి తీసుకువచ్చింది.
జెమిని ఏఐ ముందుగా జెమిని నానోతో ముందుకు వచ్చింది. ప్రస్తుతం జెమిని నానో పిక్సెల్ 8 ప్రొలో అందుబాటులోకి రాగా సమ్మరైజేషన్ ఇన్ ది రికార్డర్ యాప్, స్మార్ట్ రిప్లై ఆన్ జీబోర్డ్ వంటి ఫీచర్లు ఆకట్టుకోనున్నాయి. ఇక జెమిని ప్రో ప్రస్తుతం బార్డ్‌లో ఫ్రీగా లభిస్తుంది. దీని అడ్వాన్స్డ్ టెక్ట్స్ ఆధారిత సామర్ధ్యాలను యూజర్లు అనుభూతి చెందవచ్చు.
జెమిని ప్రొ బార్డ్ చాట్బాట్లో ఉచితంగా యాక్సెస్ కానుండగా, మెరుగైన చాట్ ఎక్స్పీరియన్స్ కోసం దీన్ని డెవలప్ చేశారు. ఇక జెమిని ప్రొను యూజ్ చేయాలంటే ముందుగా బార్డ్ వెబ్‌సైట్‌ను మీ వెబ్ బ్రౌజర్ ద్వారా విజిట్ చేసి గూగుల్ అకౌంట్‌తో లాగిన్ కావాలి. లాగిన్ తర్వాత బార్డ్‌లో యూజర్లు జెమిని ప్రొ అడ్వాన్స్డ్ ఫీచర్లను ఆస్వాదించవచ్చు.
Read More :
BJP | మూడు రాష్ర్టాలకు సీఎంలుగా కొత్తవాళ్లే.. యోచిస్తున్న బీజేపీ అధిష్ఠానం!