BJP | మూడు రాష్ర్టాలకు సీఎంలుగా కొత్తవాళ్లే.. యోచిస్తున్న బీజేపీ అధిష్ఠానం!
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అధికారం చేపట్టబోయే పార్టీలేవో తేలిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి కాబోయే ముఖ్యమంత్రులెవరన్న అంశంపైనే. ముఖ్యంగా బీజేపీ గెలిచిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో సీఎంల ఎంపిక కత్తిమీద సాములా తయారైంది.
BJP | న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అధికారం చేపట్టబోయే పార్టీలేవో తేలిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి కాబోయే ముఖ్యమంత్రులెవరన్న అంశంపైనే. ముఖ్యంగా బీజేపీ గెలిచిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో సీఎంల ఎంపిక కత్తిమీద సాములా తయారైంది. ఈ రాష్ర్టాల్లో బీజీపీ కొత్త ముఖాలనే సీఎం అభ్యర్థులుగా నియమిస్తుందన్న ప్రచారం సాగుతున్నది. గెలిస్తే ఆయా రాష్ర్టాలలో ఎవరు సీఎం పీఠాన్ని అధిష్ఠిస్తారన్న విషయాన్ని చెప్పకుండానే బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది.
ఫలితాల తర్వాత మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్‌లో మాజీ సీఎం వసుంధర రాజే, ఛత్తీస్‌గఢ్‌లో మాజీ సీఎం రమణ్ సింగ్‌ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే సీఎంల అభ్యర్థిత్వంపై గుంభనంగా వ్యవహరిస్తూ వచ్చిన బీజేపీ ఈసారి మూడు రాష్ర్టాల్లోనూ కొత్త వారినే సీఎం పీఠంపై కూర్చోబెడుతుందన్న ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు ముఖ్యమంత్రుల ఎంపిక కోసం ప్రధాని మోదీ బుధవారం తన నివాసంలో సుమారు ఐదు గంటల పాటు అమిత్ షా, నడ్డాలతో సమావేశమయ్యారు. సీఎంల ఎంపిక పూర్తయ్యిందని, ఒకటి రెండు రోజుల్లో పేర్లు ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

