Sajjan Kumar : తండ్రీకొడుకులను తగులబెట్టిన కేసులో కాంగ్రెస్ పార్టీ (Congress party) మాజీ ఎంపీ (Former MP) సజ్జన్ కుమార్ (Sajjan Kumar) దోషిగా తేలాడు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue court) ఆయనను దోషి (Convict) గా తేల్చింది. ఈ నెల 18న ఆయనకు ఏ శిక్ష విధించాలనేది ఖరారు చేయనున్నట్లు కోర్టు తెలిపింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన ఒక కేసులో సజ్జన్ కుమార్ ఇప్పటికే జీవితఖైదు అనుభవిస్తున్నారు.
అదే అల్లర్ల సందర్భంగా 1984 నవంబర్ 1న ఢిల్లీలోని సరస్వతి నగర్లో తండ్రీకొడుకులు ఇద్దరినీ తగులబెట్టి సజీవదహనం చేశారు. ఈ కేసులో కూడా నిందితుడిగా ఉన్న సజ్జన్ కుమార్‌ను కోర్టు ఇవాళ దోషిగా తేల్చింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఆదేశాలు జారీచేశారు. సజ్జన్ కుమార్‌ను తీహార్ జైలు నుంచి తీసుకొచ్చి కోర్టులో హాజరుపర్చారు. 1984 నవంబర్ 1న జశ్వంత్ సింగ్, తరుణ్‌దీప్ సింగ్ అనే ఇద్దరు తండ్రీకొడుకులను సజీవదహనం చేసిన కేసులో సజ్జన్ కుమార్ దోషిగా తేలాడు.
1984 అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు ప్రతీకారంగా సిక్కుల ఊచకోత జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీలో జశ్వంత్ సింగ్, తరుణ్‌దీప్ సింగ్ ఇంటిపై పలువురు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఇల్లును లూటీ చేశారు. ఆపై ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఇంట్లోని తండ్రీకొడుకులు ఇద్దరూ సజీవదహనమయ్యారు. ఈ ఘటనపై కోర్టు ఆదేశాలిస్తూ.. ఈ దారుణానికి పాల్పడిన మూకలో సజ్జన్ కుమార్ కేవలం ఒక సభ్యుడిగా మాత్రమే ఉండలేదని, ఆ మూకకు నాయకత్వం వహించాడని వ్యాఖ్యానించింది.
Ram Temple Priest | అయోధ్య రామాలయ ప్రధాన పూజారి కన్నుమూత
Freebies: ఎన్నికలకు ముందు ఉచిత వాగ్ధానాలు.. ఆ వైఖరిని తప్పుపట్టిన సుప్రీంకోర్టు
Anil Vij | బీజేపీ మంత్రి అనిల్ విజ్‌కు పార్టీ హైకమాండ్ షోకాజ్ నోటీస్.. ఆయన ఎలా స్పందించారంటే?