Assam Governor | గవర్నర్‌గా ఉండి బీజేపీకి ఎన్నికల ప్రచారమా?
Assam Governor | రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి, ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని అస్సాం టీఎంపీ, ఆప్ శాఖలు డిమాండ్ చేశాయి.
- రాజస్థాన్‌లో అస్సాం గవర్నర్ ప్రచారంపై విమర్శలు
- పదవి నుంచి తొలగించాలని టీఎంసీ, ఆప్ డిమాండ్
గువహటి: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి, ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని అస్సాం టీఎంపీ, ఆప్ శాఖలు డిమాండ్ చేశాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఎన్నికల నియామావళిని ఉల్లంఘించి ఉదయ్‌పూర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి తరచణ్ జైన్‌కు మద్దతుగా కటారియా ప్రచారం చేశారని టీఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది.
కొన్ని రోజుల క్రితం అస్సాం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నుమల్ మోమిన్ మిజోరాంలో బీజేపీ మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారని… ఇప్పుడు కటారియా ఆ పని చేస్తున్నారని టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రజాస్వామ్యానికి సవాల్ అని అస్సాం టీఎంసీ అధ్యక్షుడు రిపున్ బోరా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘కటారియా రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఆయన చేసిన ప్రచారం గవర్నర్ పదవిని కించపరిచింది. భారత రాజకీయాల ప్రతిష్టను నాశనం చేసింది’ అని ఆప్ అస్సాం సమన్వయకర్త భాబెన్ చౌదరి విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- Assam Governor
- BJP
- Rajasthan
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

