Sachin Pilot | రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ (Sachin Pilot) తన భార్య సారా అబ్దుల్లా (Sara Abdullah)తో విడాకులు తీసుకున్నట్లు తెలిసింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమర్పించిన తాజా అఫిడవిట్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (NC) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) కుమార్తె సారా అబ్దుల్లాను.. సచిన్ 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఆరన్, వెహాన్ ఉన్నారు. అయితే, భార్య నుంచి విడిపోయినట్లు సచిన్ వెల్లడించడం ఇదే తొలిసారి.
Sachin Pilot2
గతంలో పోటీ చేసిన టోంక్ నియోజకవర్గం నుంచే సచిన్ పైలట్ మరోసారి బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్టోబర్ 30 వ తేదీన ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్ ( poll affidavit ) లో ‘స్పౌస్’ ఉన్న చోట ‘డైవర్స్‌డ్’ (divorced) అని మెన్షన్ చేశారు. ఇక పిల్లలిద్దరూ తనపై ఆధారపడి ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో ఈ విషయం కాస్తా వెలుగులోకి వచ్చింది. 46 ఏళ్ల సచిన్ పైలట్.. తన భార్య నుంచి విడిపోయిన విషయాన్ని ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా వెల్లడించలేదు. ఇక రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 25న జరగనున్నాయి. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.
Also Read..
Jio World Plaza | జియో వరల్డ్ ప్లాజా ప్రారంభం.. అంబానీ పార్టీలో సందడి చేసిన తారలు
Varun Tej-Lavanya Tripathi | ఇటలీలో VarunLav పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో మెరిసిన కొత్త జంట
Al Jazeera: ఇజ్రాయిల్ దాడిలో అల్ జెజిరా ఇంజినీర్‌కు చెందిన 19 మంది కుటుంబసభ్యులు మృతి