పతనంతిట్ట : శబరిమల అయ్యప్ప స్వామి వార్షిక యాత్ర సీజన్ సోమవారం నుంచి ప్రారంభమవుతున్నది. లక్షలాది మంది మండల దీక్షాపరులకు స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం దేవాలయం తలుపులను తెరిచారు. మలయాళ మాసం వృశ్చికం నేటి నుంచి ప్రారంభమవుతుంది.
ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపిన వివరాల ప్రకారం, సన్నిధానం, దేవాలయ సముదాయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీక్షాపరులకు సురక్షిత తాగునీటిని నిరంతరాయంగా సరఫరా చేస్తారు. భక్తు లు విశ్రాంతి తీసుకోవడానికి బల్ల లు, తాగునీటి కియోస్క్‌లు, అల్లం నీరు, వేడి నీరు అందుబాటులో ఉంచారు. వందలాది మంది పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం పని చేస్తారు. అత్యవసర వైద్య సేవల కోసం కేంద్రాలను ఏర్పాటు చేశారు.