న్యూఢిల్లీ, ఆగస్టు 7: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది చివరిలో భారత్‌ను సందర్శించనున్నారు. ప్రస్తుతం ఆయన పర్యటన తేదీలను ఖరారు చేస్తున్నట్లు మాస్కో పర్యటనలో ఉన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ గురువారం వెల్లడించారు. రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయ్గుతో సమావేశమైన ధోవల్ త్వరలో జరగనున్న పుతిన్ భారత పర్యటనపై భారత ప్రభుత్వం ఎంతో ఆసక్తిగా, ఆనందంగా ఉందని చెప్పారు.
పుతిన్‌తో ధోవల్ గురువారం క్రెమ్లిన్‌లో సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు టారిఫ్‌లను విధించిన మర్నాడే వీరిద్దరి భేటీ జరిగింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌కు మద్దతిచ్చినందుకు రష్యాకు ధోవల్ ధన్యవాదాలు తెలిపారు.