PM Modi | వెన్నెముక లేని దౌత్యం!.. తక్కువ ధరకు ఎల్ఎన్జీ విక్రయిస్తామని రష్యా ఆఫర్
ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)కి తీవ్ర కొరత ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో భారత్‌కు చవకగా ఎల్ఎన్జీ సరఫరా చేస్తామంటూ రష్యా ఆఫర్ ఇచ్చింది.
- అమెరికా ఆంక్షలకు జడిసి నిరాకరించిన బీజేపీ సర్కార్
న్యూఢిల్లీ: ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)కి తీవ్ర కొరత ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో భారత్‌కు చవకగా ఎల్ఎన్జీ సరఫరా చేస్తామంటూ రష్యా ఆఫర్ ఇచ్చింది. వేరే ఎవరైనా అయితే ఎగిరి గంతేసి దానికి ఒప్పుకొంటారు. అయితే మోదీ సర్కార్ మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. అమెరికా ఆంక్షలకు జడిసో, మరో కారణం చేతనో తమకు రష్యా ఎల్ఎన్జీ అవసరం లేదంటూ తెలిపింది. భారత ప్రయోజనాలను మోదీ అమెరికాకు ఎందుకు తాకట్టు పెడుతున్నారంటూ ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
మా ఎల్ఎన్జీ దిగుమతి చేసుకోండి
రాయిటర్స్ కథనం ప్రకారం.. ఏప్రిల్ 30న రష్యా మంత్రి పావెల్ సోరోకిన్ న్యూఢిల్లీ సందర్శన సందర్భంగా మన పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. తాము చవకగా ఇచ్చే ఎల్ఎన్జీని దిగుమతి చేసుకోవాలంటూ ఆఫర్ ఇచ్చారు. రష్యా ఎల్ఎన్జీని దిగుమతి చేసుకోలేమంటూ భారత్ తన నిస్సహాయతను తెలియజేసింది. దీంతో సోరోనిక్ జూన్‌లో మరోసారి భారత్‌ను సందర్శించి ఈ విషయమై చర్చలు కొనసాగిస్తారని తెలియవచ్చింది. భారత్ నిర్ణయం కారణంగా రష్యాకు చెందిన ఒక ఎల్ఎన్జీ నౌక భారత్‌కు రాకుండా సింగపూర్ సమీపంలో నిలిచిపోయింది.
భారత్ రష్యాకు అతి పెద్ద క్రూడ్ కొనుగోలుదారుగా ఉంది. అయితే ఎల్ఎన్జీ రవాణా కష్టతరం. ప్రపంచ వ్యాప్త ట్రాకింగ్ వ్యవస్థల నుంచి ఎల్ఎన్జీని దాచడం కష్టం. ప్రస్తుతం బాల్టిక్ సముద్రంలో ఉన్న రష్యాకు చెందిన పోట్రోవాయ ఎల్ఎన్జీ ప్లాంట్‌పై అమెరికా ఆంక్షలు ఉన్నాయి. ఇక్కడి నుంచి వచ్చే కార్గోను స్వీకరించడానికి భారత్ నిరాకరించడంతో వాటిని రవాణా చేయడం సాధ్యపడలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

