న్యూఢిల్లీ: సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌కు రష్యా కోర్టు ఊహించని షాకిచ్చింది. క్రెమ్లిన్ అనుకూల మీడియా అవుట్లెట్ల చానళ్లను పునరుద్ధరించేందుకు నిరాకరించిన కేసులో 2.5 డెసిలియన్ డాలర్ల (రెండు అన్‌డెసిలియన్ రూబుళ్లు) జరిమానా విధించింది. ఇది ప్రపంచ జీడీపీ కంటే అధికం.
అలాగే ప్రపంచంలో చలామణిలో ఉన్న మొత్తం సొమ్ము కంటే ఎక్కువ. ప్రపంచ బ్యాంకు లెక్క ప్రకారం ఈ మొత్తం దాదాపు 100 ట్రిలియన్ డాలర్లు. ఈ మొత్తాన్ని భారత కరెన్సీలో చెప్పాలంటే 8,40,88, 75,00,00,00,000 రూపాయలు. ఇప్పుడీ మొత్తాన్ని జరిమానాగా చెల్లించడం గూగుల్‌కే కాదు, భూమ్మీదున్న మరే సంస్థకు సాధ్యం కాదు.