న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తీరును ఎండగట్టిన ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో వివరణ ఇచ్చారు. “ప్రస్తుతం దేశంలో పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. శ్రీరాముడిని వ్యతిరేకించినవారు అధికారంలో లేరు. ఆయనను గౌరవించాలనే లక్ష్యం గలవారు అధికారంలో ఉన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైంది” అని చెప్పారు.