Mohan Bhagwat | నాగ్‌పూర్: జనాభా వృద్ధి రేటు తగ్గిపోతుండటం పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. దంపతులు కనీసం ముగ్గురు పిల్లలను కనాలని చెప్పారు. నాగ్‌పూర్‌లో ఆయన మాట్లాడుతూ, మన దేశంలో జనాభా తగ్గుతుండటం ఆందోళనకరమని తెలిపారు.
జనాభా వృద్ధి రేటు 2.1 కన్నా తగ్గితే, ఆ సమాజం నాశనమవుతుందనివివరించారు. ఈ సమస్య కారణంగానే అనేక భాషలు, సంస్కృతులు అంతరించిపోయాయని తెలిపారు. కాగా, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2021లో వెల్లడించిన వివరాల ప్రకారం, మన దేశంలో ఫెర్టిలిటీ రేటు 2.2 నుంచి 2కు తగ్గిపోయింది.