న్యూఢిల్లీ: ముస్లింలు, క్రైస్తవులతో సహా అన్ని మతాలకు చెందిన వారు తమ సంస్థలో చేరవచ్చని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఆదివారం ప్రకటించారు. అయితే తమ మతాలను పక్కనపెట్టి హిందూ సమాజ సభ్యులుగా ఎవరైనా ఆర్ఎస్ఎస్లో చేరవచ్చని ఆయన షరతు విధించారు.
ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్, నిధుల వివరాలపై కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన విలేకరుల సమావేశంలో జవాబిస్తూ 1925లో ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించిందని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని ఆయన చెప్పారు. ఏ రాజకీయ పార్టీని సంఘ్ బలపరచదని, అయితే జాతీయ ప్రయోజనాలు ఉన్నట్లు భావించిన విధానాలను మాత్రం సమర్థిస్తుందని ఆయన స్పష్టం చేశారు.