No Fuel | జీవితకాలం ముగిసిన (EOL) వాహనాలకు ఆయిల్ పంపుల వద్ద ఇంధనాన్ని (No Fuel) నిషేధిస్తూ ఢీల్లీ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈ నిషేధంపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తడంతో ఢిల్లీలోని బీజేపీ సర్కారు వెనక్కి తగ్గింది. కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై నిషేధం తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది.
అయితే, ఈ విధానం కారణంగా ఢిల్లీకి చెందిన నితిన్ గోయల్ అనే వ్యక్తి తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. తన వద్ద ఉన్న అత్యంత ఖరీదైన కార్లను చాలా తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చింది. 2013లో దాదాపు రూ.65 లక్షలకు కొనుగోలు చేసిన జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తికి కేవలం రూ.8 లక్షలకే అమ్మేశాడు. అంతేకాదు, పదేళ్ల కిందట రూ.40 లక్షలు చెల్లించి కొనుగోలు చేసిన మెర్సిడెస్ సి క్లాస్ 220 సీడీఐ స్పోర్ట్స్ లిమిటెడ్ ఎడిషన్‌ను కూడా కేవలం రూ.4 లక్షలకే విక్రయించాడు. ఇప్పుడు ఇంధనం నిషేధాన్ని ఎత్తివేయడంతో నితిన్ గోయల్ తీవ్రంగా బాధపడుతున్నాడు. విలువైన కార్లను చాలా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా, వాహన కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిపడాన్ని అనుమతించేది లేదని ఢిల్లీ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి దానిని అమలు చేస్తున్నది. దీనికోసం దేశ రాజధానిలోని 500 పెట్రోల్ బంకుల్లో ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరా సిస్టమ్‌లను ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (DTIDC) ఏర్పాటు చేసింది. అదేవిధంగా 100 ప్రత్యేక బృందాలను ఢిల్లీ రవాణా శాఖ నియమించింది. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, సోనిపట్‌లకు ఈ నిషేధాన్ని విస్తరించనున్నారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి నేషనల్ క్యాపిటల్ రీజియన్(NCR)లోని మిగిలిన ప్రాంతాల్లో అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రభుత్వ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో వెనక్కి తగ్గింది. కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై నిషేధం తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు గురువారం ప్రకటించింది. దీనిపై పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ సాంకేతిక సవాళ్లు, సంక్లిష్ట వ్యవస్థల కారణంగా ఇంధన నిషేధం కష్టతరమని అన్నారు. కార్లు, మోటారు సైకిళ్లను జాగ్రత్తగా చూసుకునే వ్యక్తులను శిక్షించే బదులు, వాహనాలను సరిగా నిర్వహించని వాహనాలను స్వాధీనం చేసుకునే వ్యవస్థను రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు.
Also Read..
Thalapathy Vijay | సీఎం అభ్యర్థిగా దళపతి విజయ్.. టీవీకే కీలక ప్రకటన
Instagram Scam: ఇన్‌స్టాలో తంత్ర విద్య స్కామ్.. 18 లక్షలు కోల్పోయిన ఎంబీఏ చదువుకున్న అమ్మాయి