న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన విచారణలో భాగంగా అనేక కేసులకు సంబంధించిన ప్రాపర్టీలను సీజ్ చేసి అటాచ్ చేసింది. ఆర్థిక నేరాలకు లింకున్న ఆ ప్రాపర్టీలను స్వాధీనం చేసుకున్నారు. లోక్సభలో ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి సీతారామన్(Nirmala Sitharaman) బదులిస్తూ.. విజయవంతంగా ఈడీ సుమారు 22,280 కోట్ల విలువైన ప్రాపర్టీలను సీజ్ చేసినట్లు చెప్పారు. దీంట్లో విజయ్ మాల్యాకు చెందిన 14,131.6 కోట్లు ఆస్తి ఉన్నట్లు తెలిపారు. ఇక నీరవ్ మోదీ కేసులో 1,052.5 కోట్ల ఆస్తుల్ని బ్యాంకులు జప్తు చేసుకున్నట్లు చెప్పారు.
నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ స్కామ్లో 17.47 కోట్లు బ్యాంకులు సీజ్ చేశాయన్నారు. ఎస్ఆర్ఎస్ గ్రూపుకు చెందిన 20.15 కోట్లు, రోజ్ వాలీ గ్రూపుకు చెందిన 19.40 కోట్లు, సూర్య ఫార్మసీకి చెందిన 185.13 కోట్లు, నౌషేరా షేక్ గ్రూపుకు చెందిన 226 కోట్లు, నాయుడు అమృతేశ్ రెడ్డికి చెందిన 12.73 కోట్ల ప్రాపర్టీలను బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయి. మోహుల్ చోక్సీకి చెందిన 2,565.90 కోట్ల విలువైన ప్రాపర్టీలను బ్యాంకులు స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
The Enforcement Directorate (@dir_ed) has successfully Restored properties worth around Rs 22,280 crores, and I am only talking about the major cases.
I would like to list the number of cases: –
Vijay Mallya – Rs 14,131.6 crores, the complete amount of the attached property… pic.twitter.com/fJRPEyPOnI
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) December 17, 2024