న్యూఢిల్లీ : ఢిల్లీ శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను ఆకర్షించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అనేక వాగ్దానాలు చేస్తున్నది. హిందూ దేవాలయ పూజారులకు, గురుద్వారా గ్రంథిలకు నెలకు రూ.18,000 గౌరవ వేతనం చెల్లిస్తామని వాగ్దానం చేసింది. ఆ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఇదంతా రాజకీయ స్టంట్ అని బీజేపీ, కాంగ్రెస్ ఎద్దేవా చేశాయి.