న్యూఢిల్లీ, అక్టోబర్ 25: దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీతో లా కమిషన్ బుధవారం భేటీ అయ్యింది. దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపల్, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలో చేయాల్సిన మార్పులు, చేర్పులను వివరించడమే కాక, జమిలి ఎన్నికలకు సంబంధించి రోడ్ మ్యాప్‌ను సమర్పించింది. అయితే ఏకకాల ఎన్నికలకు సంబంధించి లా కమిషన్ తన నివేదికను ఇంకా పూర్తి చేయలేదని తెలిసింది.