Road Accident | బైశాఖి వేడుకలకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భక్తులు మృతి
Road Accident | బైశాఖి వేడుకలను జరుపుకునేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పంజాబ్ హోషియార్పూర్ జిల్లా ఖురల్‌గఢ్ సాహిబ్‌కు వెళ్తున్న సమయంలో గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకున్నది.
Road Accident | బైశాఖి వేడుకలను జరుపుకునేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పంజాబ్ హోషియార్పూర్ జిల్లా ఖురల్‌గఢ్ సాహిబ్‌కు వెళ్తున్న సమయంలో గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. మృతులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని గర్శంకర్ డిప్యూటీ సూపరింటెండెంట్ దల్జీత్ సింగ్ పేర్కొన్నారు. యూపీ ముజఫర్‌నగర్ జిల్లా మస్తాన్ ఖేరాకు చెందిన భక్తులు బైశాఖి వేడుకలు జరుపుకునేందుకు వెళ్తున్న సమయంలో ఖురల్‌గఢ్ సాహిబ్‌కు కాలినడకన వెళ్తున్నారు.
కొండ ప్రాంతం వద్ద వాలుగా ఉన్న ప్రాంతంలో అటుగా వస్తున్న లారీ డ్రైవర్ నియంత్రణ కోల్పోయి.. పాదయాత్రగా వెళ్తున్న 17 మందికిపైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మందికి గాయలయ్యాయి. ఇందులో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. పీజీఐఎంఈఆర్ చండీగఢ్‌కు తరలించగా.. మిగతా వారిని గఢ్శంకర్లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ట్రక్కు బ్రేక్‌లు ఫెయిల్ అయ్యాయని, దాంతో వాహనం అదుపు తప్పిందని డీఎస్పీ తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

