Road Accident | ఛత్తీస్గఢ్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. రాయ్పూర్ నుంచి అంబికాపూర్ వెళ్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో నలుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. సుర్గుజా జిల్లా అంబికాపూర్ – బిలాస్పూర్ జాతీయ రహదారి 130పై ఉదయపూర్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాతం తర్వాత ట్రక్కు డ్రైవర్ తప్పించుకునేందుకు కార్ని రివర్స్ చేయగా.. కారు మరింత దెబ్బతింది. మృతులను చంగురభఠా రాయ్పూర్ వాసులుగా గుర్తించారు. జగదల్పూర్కు కారులో బయలుదేరగా.. ఉదయపూర్ అదానీ గెస్ట్ హౌస్ సమీపంలో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాలను కట్టర్ల సహాయంతో తొలగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.