Road accident : కర్ణాటక డిప్యూటీ సీఎం (Karnataka Deputy CM) డీకే శివకుమార్ (DK Shivakumar) కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం (Escort vehicle) బోల్తా పడింది. ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ దానిపై కంట్రోల్ కోల్పోవడంతో ఫల్టీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో సహా వాహనంలోని నలుగురికి గాయాలయ్యాయి. మాండ్యా (Mandya) జిల్లాలోని శ్రీరంగపట్న (Srirangapatna) తాలూకాలో టీఎం హోసూర్ గేటు దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
డీకే శివకుమార్ మైసూరులో ఓ కన్వెన్షన్‌కు హాజరై బెంగళూరుకు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన నలుగురికి ఘటనా స్థలంలోని ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. కర్ణాటకకు చెందిన సీనియర్ పోలీస్ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.