పాట్నా: బీహార్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కీలక మిత్ర పక్షాన్ని కోల్పోయింది. ఆర్ఎల్జేపీ చీఫ్ పశుపతి కుమార్ పరాస్ మాట్లాడుతూ, ఎన్డీయేలో తమకు అన్యాయం జరిగిందని, తమది దళిత పార్టీ కావడమే దీనికి కారణమని చెప్పారు. అందుకే కూటమి నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
బీహార్లో ఎన్డీయే సమావేశాలు జరిగేటపుడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, జేడీయూ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఇచ్చే ప్రకటనల్లో తాము పంచ పాండవులం అని చెప్పేవారని, తమ పార్టీ గురించి ప్రస్తావించే వారు కాదని అన్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 243 స్థానాలకు తాము పోటీ చేస్తామన్నారు. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.