న్యూఢిల్లీ : ఇస్లాం కంటే ముందుగానే హిందూమతం ఉందని కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత, రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా (Manoj Jha) స్పందించారు. మతం, జాతీయత, నాగరికత, సరిహద్దులు వీటన్నింటి కంటే మానవత్వమే ముందు నిలవాలని స్పష్టం చేశారు. ఆజాద్ లేవనెత్తిన ప్రశ్నకు ఆయన మాటల్లోనే సమాధానం ఉందని చెప్పారు.
ఆయన సూచిస్తున్న మార్గం గతం చేసిన గాయాలను మాన్పి అందమైన భవిష్యత్‌ను ఆవిష్కరిస్తుందని అన్నారు. మతం కంటే సమాజంలో మానవత్వం ఉందని, ఈ అవగాహనను సమాజం అవగతం చేసుకుంటే మతపరమైన తీవ్రవాదం సహజంగానే అంతరిస్తుందని మనోజ్ ఝా పేర్కొన్నారు. భారత్‌లో ఇస్లాం కంటే హిందూ మతం అత్యంత పురాతనమైనదని అంతకుముందు గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై హాట్ డిబేట్ సాగింది.
హిందువుల నుంచి మత మార్పిడి వల్లే దేశంలో ముస్లింలు వచ్చారని, కశ్మీర్లో ముస్లింలు అందరూ కశ్మీరీ పండిట్ల నుంచి మత మార్పిడి అయిన వారేనని ఆజాద్ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రతి ఒక్కరూ హిందూ ధర్మంలోనే జన్మించారని అన్నారు.
Read More :