Emergency Landing | బాత్రూంలో కుప్పకూలిన పైలట్ : 271 మంది ప్రయాణీకులతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
271 మంది ప్రయాణీకులతో మియామి నుంచి చిలీ వెళుతున్న విమానంలోని బాత్రూంలో పైలట్ కుప్పకూలడంతో సహ పైలట్లు పనామా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానాన్ని (Emergency Landing) ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
న్యూయార్క్ : 271 మంది ప్రయాణీకులతో మియామి నుంచి చిలీ వెళుతున్న విమానంలోని బాత్రూంలో పైలట్ కుప్పకూలడంతో సహ పైలట్లు పనామా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానాన్ని (Emergency Landing) ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో లాటం ఎయిర్లైన్స్కు చెందిన కమాండర్ ఇవాన్ అనదుర్ మరణించారు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో అనదుర్కు తీవ్ర గుండెపోటు రావడంతో విమాన బాత్రూంలో కుప్పుకూలాడు.
దీంతో సహ పైలట్లు విమానాన్ని పనామా నగరంలోని టాకుమెన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం దిగిన వెంటనే అక్కడున్న ఇద్దరు వైద్యులతో పాటు నర్సు ఇసదుర వైద్య సాయం అందించారు. పైలట్ ప్రాణాలు నిలిపేందుకు వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
పనామా ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణీకులను ఖాళీ చేయించి పనామా సిటీ హోటళ్లలో ప్రయాణీకులకు వసతి ఏర్పాట్లు చేశారు. మరుసటి రోజు విమాన సర్వీసును పునరుద్ధరించారు. విమానం ల్యాండయిన అనంతరం వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఇవన్ అనదుర్ను కాపాడలేకపోయారని లాటం గ్రూప్ విచారం వ్యక్తం చేసింది. బాధిత పైలట్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది.
Read More :
Jailer Movie | రజినీ కావాలయ్యా పాటకు జపాన్ అంబాసిడర్ స్టెప్పులు.. వీడియో వైరల్
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Dies
- emergency landing
- Pilot
- Plane
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

