Jailer Movie | తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajinikanth) నటించిన ‘జైలర్’ (Jailer) చిత్రం బాక్సాఫీసువద్ద దూసుకెళ్తోంది. గత వారం రిలీజైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ చిత్రంలోని ‘కావాలయ్యా’ పాట యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సాంగ్ మ్యూజిక్ వినగానే అంతా ఊగిపోతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ పాటకు రీల్స్ చేస్తూ నెట్టింట సందడి చేస్తున్నారు. ఫేస్బుక్, యూ ట్యూబ్, ట్విట్టర్లో ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. యువత, రజినీ అభిమానులే కాదు.. కొందరు ప్రముఖులు కూడా ఈ పాటకు ఫిదా అవుతున్నారు.
తాజాగా భారత్‌లోని జపాన్ రాయబారి (Japanese Ambassador) హిరోషీ సుజుకీ (Hiroshi Suzuki) ‘కావాలయ్యా’ పాటకు కాలుకదిపి రజినీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రముఖ జపనీస్ యూట్యూబర్ మయో శాన్ (Mayo san)తో కలిసి ఈ పాటకు స్టెప్పులేసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను హిరోషీ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘జపనీస్ యూట్యూబర్ మాయో శాన్తో కలిసి కావాలయ్యా డ్యాన్స్ వీడియో. రజనీకాంత్‌పై నా ప్రేమ కొనసాగుతుంది’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
రజినీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెల్సన్ కుమార్
దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన
ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, ప్రియాంక అరుళ్మోహన్, కన్నడ స్టార్ శివరాజ్
వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించారు.
Kaavaalaa dance video with Japanese YouTuber Mayo san(@MayoLoveIndia)🇮🇳🤝🇯🇵
My Love for Rajinikanth continues … @Rajinikanth #Jailer #rajinifansVideo courtesy : Japanese Youtuber Mayo san and her team pic.twitter.com/qNTUWrq9Ig
— Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) August 16, 2023
Also Read..
Mud Tsunami | ఇటలీని ముంచెత్తిన బురద ప్రవాహం.. వీడియో
Manipur | భారీ వర్షానికి విరిగిపడ్డ కొండచరియలు.. హైవేపై నిలిచిపోయిన 500 గూడ్స్ ట్రక్కులు
Hot Chocolate | విమానంలో హాట్ చాక్లెట్ పడి చిన్నారికి గాయాలు.. స్పందించిన విస్తారా