Manipur | భారీ వర్షానికి విరిగిపడ్డ కొండచరియలు.. హైవేపై నిలిచిపోయిన 500 గూడ్స్ ట్రక్కులు
Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur )లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడుతున్నాయి. నోనీ ( Noney ) జిల్లాలో కురిసిన వర్షానికి భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.
Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur )లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడుతున్నాయి. నోనీ ( Noney ) జిల్లాలో కురిసిన వర్షానికి భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇంఫాల్-సిల్చార్ (Imphal-Silchar) హైవేపై సుమారు 500 గూడ్స్ వాహనాలు (goods vehicles ) ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలోని ఇరాంగ్, అవాంగ్ఖుల్ పార్ట్ 2, ఖోంగ్సాంగ్, రంగ్ఖుయ్ గ్రామాల మధ్య జాతీయ రహదారి 37పై బుధవారం కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. ‘గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కనీసం 500 గూడ్స్ వాహనాలు హైవేలోని వివిధ ప్రాంతాల్లో నిలిచిపోయాయి. రహదారిని క్లియర్ చేసి, ట్రాఫిక్‌ను తిరిగి ప్రారంభించే పనులు జరుగుతున్నాయి’ అని వారు వెల్లడించారు.
కాగా, గతేడాది జూన్‌లో కురిసిన భారీ వర్షాలకు నోనీ జిల్లాలో రైల్వే నిర్మాణ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. జూన్ 30న జిరిబామ్-ఇంఫాల్ రైల్వే లైన్‌లోని టుపుల్ రైల్వే యార్డ్ నిర్మాణ స్థలంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ ఘటనలో సుమారు 61 మంది మరణించారు.
కాగా, గత కొన్ని రోజులుగా హింసాత్మకంగా దెబ్బతిన్న ఈశాన్య రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడటం వల్ల నిత్యావసర వస్తువుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు ఈ ఏడాది మేలో రాష్ట్రంలో జాతి ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ ఘర్షణలు మూడు నెలలకు పైగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకూ 160 మందికి పైగా మరణించారు. అనేకమంది కనిపించకుండా పోయారు.
Also Read..
Hot Chocolate | విమానంలో హాట్ చాక్లెట్ పడి చిన్నారికి గాయాలు.. స్పందించిన విస్తారా
Boat Capsize | ఘోర ప్రమాదం.. వలసదారులతో వెళ్తున్న పడవ మునిగి 63 మంది మృతి
Bhagavanth Kesari | భగవంత్ కేసరి నుంచి సాలిడ్ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ లోడింగ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

