Manoj Kumar Jha : జనగణనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల పట్ల ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా అభ్యంతరం వ్యక్తం చేశారు. 2021 నుంచి ఎలాంటి జన గణన నిర్వహించలేదు.. జనగణన చేపట్టకపోవడం దేశంలో ఇదే తొలిసారి దీన్ని ఎందుకు నిలిపివేశారని ఆయన ప్రశ్నించారు. ఇంత పెద్ద దేశంలో సంక్లిష్ట సమయాల్లోనూ జనగణనను ఆపలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాంటిది ఇప్పుడు జనగణన ఆపేయడంపై ప్రజల్లో ఆందోళన, సందేహం నెలకొన్నదని అన్నారు. దీనికి ఎలాంటి రాకెట్ సైన్స్ అవసరం లేదని సమాజంలో వాస్తవ స్ధితిగతులు అంచనా వేసేందుకు అదనంగా ఓ కాలమ్ జోడిస్తే చాలని చెప్పారు. ఆ కాలమ్ వివరాల ఆధారంగా దేశంలో వాస్తవ పరిస్ధితి వెలుగుచూస్తుందని అన్నారు.
దీన్ని మనం సాధించాలని కోరుకోకుంటే 96 శాతం మంది భవిష్యత్‌ను 2.5 నుంచి 3 శాతం మంది నిర్ణయించే అదే వ్యవస్ధ కొనసాగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక యూపీలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిస్ ఇండియా పోటీల్లో దళిత, గిరిజన, ఓబీసీ వర్గాలకు చెందిన ఒక్క మహిళ కూడా లేరని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ డిబేట్‌గా మారాయి.
Read More :
Hyderabad Metro | మెట్రో ప్రయాణికుల ఆందోళన.. పెయిడ్ పార్కింగ్‌పై వెనక్కి తగ్గిన ఎల్అండ్టీ