Parliament Building | పార్లమెంట్ నూతన భవనాన్ని శవపేటికతో పోల్చిన ఆర్జేడీ..
Parliament Building | నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొద్దిక్షణాల ముందు లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ ) పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందించింది. కొత్త పార్లమెంట్ భవనం శవపేటికలా ఉందంటూ సంచలన ట్వీట్ చేసింది.
Parliament Building | నూతన పార్లమెంట్ విషయంలో మోదీ సర్కార్ వ్యవహరిస్తున్న ఏకపక్ష ధోరణి రాజకీయంగా పెను దుమారమే రేపుతోంది. ప్రతిపక్షాల అభ్యంతరాల్ని బేఖాతరు చేస్తూ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించాయి. ఈ క్రమంలోనే ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొద్దిక్షణాల ముందు లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ ) పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందించింది. కొత్త పార్లమెంట్ భవనం శవపేటికలా ఉందంటూ సంచలన ట్వీట్ చేసింది.
శవపేటిక, పార్లమెంట్ నూతన భవనం ఫొటోలను ఆదివారం ఉదయం ఆర్జేడీ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. దీనికి యే క్యా హై ( ఇది ఏంటి?) అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పార్లమెంట్ నూతన భవనాన్ని శవపేటికతో పోలుస్తూ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

