Rishab Shetty | తమిళనాడులోని కరూర్‌లో టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) చేపట్టిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట (Karur stampede) ఘటనపై కాంతార నటుడు రిషభ్ శెట్టి (Rishab Shetty) తాజాగా స్పందించారు. ఇది దురదృష్ట సంఘటనగా అభివర్ణించారు. ఇది ఏ ఒక్కరి వైఫల్యమో కాదని.. సమష్టి పొరపాటుగా పేర్కొన్నారు.
ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషభ్ శెట్టి మాట్లాడారు.. ‘కరూర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. ప్రజలు హీరోలను ఆరాధిస్తారు. తమకు ఇష్టమైన హీరో సినిమాలు రిలీజ్ అయినప్పుడు పాలాభిషేకాలు చేస్తారు. ఈ ఘటనపై స్పందించడానికి మాటలు రావడం లేదు. ఇది ఒకరి వల్ల జరిగిందని నేను అనుకోవట్లేదు. ఇది సమష్టి వైఫల్యం కావొచ్చు. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఘటనలు జరగవు. ఇలాంటి ర్యాలీలు ఉన్నప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులు, ప్రభుత్వాన్ని నిందించడం సులభమే. కానీ క్రౌడ్‌ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు’ అని చెప్పుకొచ్చారు. గతనెల 27న కరూర్‌లో టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీ విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడ్డారు.
Also Read..
“Karur stampede | కరూర్ తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీవీకే”
“Karur Stampede | కరూర్ బాధిత కుటుంబాలతో వీడియో కాల్లో మాట్లాడిన విజయ్”
“Annamalai | రాజ్యసభ సీటు కోసం ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నారు.. కమల్ హాసన్‌పై అన్నామలై ఫైర్”